రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామ శివారులో ఆదివారం ఓ వ్యక్తి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నామని ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.
పోలీసు తెలిపిన వివరాల ప్రకారం గండి లచ్చపేట గ్రామానికి చెందిన బొమ్మని సమ్మయ్య అనే వ్యక్తి అతని ఆటోలో తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి పట్టణాలకు ఎక్కువ దొరకు అమ్ముతున్నారని సమాచారం మేరకు తుర్కపల్లి గ్రామ శివారు వద్ద ఆటోను తనిఖీ చేయగా ఐదు కింటల రేషన్ బియ్యం పట్టు పడగా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.