సిద్దిపేట వైద్య విద్యా మణిహారం, శ్రీ రంగనాయక స్వామి బి.ఫార్మసి కళాశాల.
సిద్దిపేట చెంతన ఫార్మసి విద్యా..
మంత్రి హరీష్ రావు చొరవ తో ఎగ్జిబిషన్ సొసైటీ వారి సౌజన్యం తో ఫార్మసి కాలేజ్.
రూ.10కోట్లతో రామంచ గ్రామం, రంగనాయక సాగర్ ప్రాంతంలో నిర్మాణం జరిగింది.ఈ విద్యాసంవత్సరం 60 సీట్ల తో ప్రారంభం కానుంది.
రేపు ప్రారంభించనున్న మంత్రులు హరీశ్ రావు, సబిత ఇంద్రారెడ్డి.
సిద్దిపేట సిగలో మరో వైద్య విద్యా మణిహారంగా బి ఫార్మసి కళాశాల రాబోతుంది, మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ తో ఎగ్జిబిషన్ సొసైటీ వారి సౌజన్యం తో రూ.10కోట్ల తో అద్భుతమైన కళాశాల నిర్మాణం అయింది. రేపు మంత్రులు హరీశ్ రావు సబితా ఇంద్రారెడ్డి ఈ కళాశాల భవనాన్ని ప్రారంభిస్తారు.
6 ఎకరాల్లో,10 కోట్లతో జి ప్లస్ 5 ప్లోర్ లతో కళాశాల నిర్మాణము, పూర్తి అయిన గ్రౌండ్ ప్లోర్.
60 సీట్ల తో ఈ విద్యా విద్యా సంవత్సరం నుండి ప్రారంభం కానుంది.అక్టోబర్ 1 తేదీ నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి.
సిద్దిపేట లో ఇప్పటికే మెడికల్, నర్సింగ్ కళాశాల ఉండగా మరో మెడిసిన్ విద్యను ప్రోత్సహించే దిశగా మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ చూపారు. సిద్దిపేట విద్యాలయాల నిలయంగా విరాజిల్లుతున్న క్రమంలో బి ఫార్మసి విద్యా గొప్ప వరంగా మారనుంది. అధునాతన హాంగులతో, కార్పోరేట్ స్థాయి లో మెడిసిన్ విద్యా అందించేందుకు మంత్రి హరీష్ రావు కృషి చేస్తున్నారు. 10కోట్ల తో బి ఫార్మసి కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేసుకొని గ్రౌండ్ ప్లోర్ తో కళాశాల ప్రారంభం కానుంది.6 ఎకరాల విస్తీర్ణంలో జి ప్లస్ 5 ఫ్లోర్ లతో నిర్మాణం కానుంది. ఈ విద్యా సంవత్సరం నుండి 60 సీట్ల తో తరగతులు ప్రారంభించేలా ఇప్పటికే జాతీయ ఫార్మసి కౌన్సిల్ అనుమతి లభించింది. అక్టోబర్ 1 వ తేదీ నుండి తరగతులు ప్రారంభించడానికి ముమ్మరంగ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో రేపు మంత్రులు హరీశ్ రావు,సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. గ్రౌండ్ ప్లోర్ లో కంప్యూటర్ ల్యాబ్,ఫార్మసీ ల్యాబ్, తరగతి గదులు, లైబ్రరీ ఫార్మసి విద్యకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసారు.