రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రభుత్వ దిగువ మధ్యతరగతి వారు కడుపు నింపాలన లక్ష్యంతో రేషన్ దుకాణాలు ద్వారా ఉచిత రేషన్ బియ్యం రేషన్ బియ్యాన్ని కార్డు ఓల్దార్లు దళారులకు అమ్ముకొని సొమ్ము చేసుకొంటున్నారు.ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది కి ప్రతి ఒక్కరికి 6కిలోలు చొప్పున ఇస్తున్న బియ్యాన్ని దళారులకు 16రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నారు నిజమైన నిరుపేదలు కార్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటే అన్ని రకాల సంపాదన ఉన్న వారి ఇళ్లలో తెల్ల రేషన్ కార్డు లు ఉన్నాయి వారికీ తినడానికి వినియోగించు కోకుండా డబ్బులకు అమ్ముకుంటున్నారు ప్రతి నెల 1నుండి 15 వరకు రేషన్ షాపులలో వచ్చే బియ్యాన్ని అమ్మడానికి ఎక్కడికి వెళ్లనవసరం లేకుండా కొనే దళారులు ఇంటి ముందుకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
