24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 16)
సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అనంత సాగర్లో విషాదం నెలకొంది.గ్రామానికి చెందిన మొంగల లక్ష్మయ్య శనివారం తన వ్యవసాయ పొలం వద్ద బోర్ మోటార్ వేయడానికి వెళ్ళాడు.స్టార్టర్ నడవక పోవడంతో దానిని రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
