దౌల్తాబాద్: సిద్దిపేట జిల్లా TUWJ జిల్లా సహాయ కార్యదర్శి గా తొగుట మండలం బంజెరుపల్లి కి చెందిన సీనియర్ జర్నలిస్టు అల్వాల కృష్ణాగౌడ్ ను ఎన్నుకున్నారు..అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులుగా చెరుకు నరేష్ రెడ్డి ఎన్నికయ్యారు.. ఆదివారం సిద్దిపేట లో జరిగిన జిల్లా మహాసభలో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా సంఘం సీనియర్ సభ్యులు జీడిపల్లి రాంరెడ్డి, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉళ్లేంగుల సాయి కుమార్, సంఘం సభ్యులు అనిమెల్ల బాలనర్సయ్య, జూపల్లి నర్సింలు, మాదాసు నాగరాజు, ఎం డీ షఫీ, చెరుకు లక్షారెడ్డి, మహేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారిని శాలువా కప్పి సన్మానించారు..
