నేరాలు ప్రాంతీయం

దళితులను గుడిలోకి రానివ్వకపొడం అమానుషం

47 Views

డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్

మర్కుక్, ఆగస్టు 27

ఆధునిక యుగంలో దళితులను గుడిలోకి రాకుండా బోనాలు సమర్పించకుండా అడ్డుకొవడం ఆటవికం అమానుషమని దళితుల ఆత్మగౌరవం పై దెబ్బకొడితే సహించేది లేదని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ హెచ్చరించారు.

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటపూర్ లో దళితులను గుడిలోకి రాకుండా అంటరానితనం పాటించి అవమానించిన సంఘటన పై మంగళవారంనాడు గ్రామానికి చెరుకొని దళితులతో డిబిఎఫ్ నేత పి. శంకర్, కెవిపిఎస్ నేత కృష్ణమూర్తి, దళిత నేత మాజీ సర్పంచ్ నర్సింలు, దాసరి ఎగొండ స్వామి, బ్యాగరి వేణులు సమావేశమై సంఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దళిత వాడలో వున్న ఎల్లమ్మ, మాతమ్మ, గుడిలో కొబ్బరి కాయలు కొట్టారు. అనంతరం మర్కుక్ పొలీసు స్టేషన్ ముందు ధర్నా చేసి దళితులను అవమానపర్చిన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సి.ఐ మహెందర్ రెడ్డి, ఎస్.ఐ దామొదర్ లతో చర్చలు జరిపి నిందితుల పై కఠిన చర్యలు తీసుకొవాలని కోరారు. ఇరువర్గాలతో సి.ఐ చర్చలు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సి.ఐ తెలిపారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ దుర్గా మతా ఉత్సవం లో దళితుల బోనాలు గుడివద్దకి అనుమతించమని, గుడిమెట్లు కూడా ఎక్కవద్దని అడ్డుకొవడంతో బోనాల నైవేద్యాన్ని కాలువ లోని గంగలో వేశారన్నారు. గ్రామాన్ని జిల్లా కలెక్టర్, పొలీసు కమిషనర్ సందర్శించి దళితులకు అలయ ప్రవేశం కల్పించి దళితుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. దళితులను అవమాన పర్చిన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గుడికి వెళ్ళి అవమానపడటం కంటె గుడులను బహిష్కరించి బాబాసాహెబ్ అంబెద్కర్ బాటలో పయాణించాలన్నారు. శుక్రవారంనాడు ‌ దుర్గమాతకు బోనాలను సమర్పించాలని దళితులు నిర్ణయించుకన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ దళితులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్