రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో ఐదుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టు పడగా కేసు నమోదు చేశామని ఎస్ఐ మహేష్ తెలిపారు. దమ్మన్నపేట ఇటుక బట్టీల ప్రాంతంలో గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఐదుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు వారి వద్దకు వెళ్లి తనిఖీ చేయగా 70000 నగదు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
