రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన యువకుడు ఉద్యోగం రాక తీవ్ర మనస్థాపంతో జక్కుల చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరణ ప్రకారం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆకుల లవన్ కుమార్ (22) గుప్త అనే యువకుడు ఉద్యోగం రాక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇదే క్రమంలో ఆదివారం ఉదయం వేకోశమున గ్రామ శివారులో ఉన్న జక్కుల చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే ఉన్న రైతులు అతని వాహనం బట్టలు సెల్ఫోన్ ఇతర సామాగ్రిని చూసి ఓ యువకుడు గల్లంతయ్యాడని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులు సంఘటన స్థలం చేరుకొని గాలించే ప్రయత్నం చేస్తుండగా అతని ఆచూకీ లభించలేదు. వార్త కవరేజ్ కోసం వచ్చిన ఆంధ్రజ్యోతి విలేకర్ గౌరీశంకర్ వెంటనే తనకున్న ధైర్యంతో చెరువులోకి దిగి మృతదేహాన్ని వెలికి తీశాడు.
