దౌల్తాబాద్ సెప్టెంబర్ 10: దుబ్బాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా తలారి నర్సింలు, ఉపాధ్యక్షుడిగా పాములపర్తి రామచంద్రం, గ్రామ ప్రధాన కార్యదర్శిగా చిందం లక్ష్మయ్య, గ్రామ ఫిషర్ మ్యాన్ అధ్యక్షుడిగా చింతకుంట్ల లింగం, గ్రామ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా చందర్ల బాలకిషన్, గ్రామ ఓబిసి అధ్యక్షుడిగా చిందం రాజయ్య, గ్రామ కిసాన్ విభాగం అధ్యక్షుడిగా భీమయ్య గారి లింగం, తదితరులను గ్రామ కమిటీ సభ్యులుగా నియామకమయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మద్దెల స్వామి, మండల జనరల్ సెక్రెటరీ మల్లారెడ్డి, నాయకులు సంపత్ రెడ్డి, ఇమ్రాన్, లక్ష్మయ్య, బొల్లం యాదగిరి, లింగం నర్సింలు తదితరులు పాల్గొన్నారు….
