రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన లింగం పరశురాములు (38) అనే వ్యక్తి గుండెపోటుతో శనివారం రాత్రి మృతి చెందాడని ఆదివారం కుటుంబ సభ్యులు తెలిపారు. పరశురాములు బతుకుదెరువు కోసం దుబాయ్ దేశంలో నాలుగు సంవత్సరాలుగా వెళుతున్నాడని ఇదే క్రమంలో విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్ప కూలాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పరశురాములు మృతదేహం త్వరగా స్వగ్రామం రావాలని స్థానిక మంత్రి కేటీఆర్ ని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
