
తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని జగదేవపూర్ లో ఘనంగా నిర్వహించారు.ఆదివారం
రజక సంఘం మండల అధ్యక్షులు రాచమల్ల ఎల్లేష్ మరియు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికీ పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టి తెలంగాణ గడ్డ మీద భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటంలో పాల్గొని దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మండల రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.




