నేరాలు

మహిళలకు అండగా షీటీం..

125 Views

-కరీంనగర్ రూరల్ ఏసిపి వెంకటరమణ

(తిమ్మాపూర్ మార్చి 21)

కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు కరీంనగర్ రూరల్ ఎసిపి ఆధ్వర్యంలో ఈ రోజు తిమ్మాపూర్ మండలం లోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు షీ టీమ్ ఉపయోగాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమనికి ఉమెన్ షీ టీమ్ సీఐ శ్రీలత హాజరై మాట్లాడుతూ..

నేటి కాలంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా సమస్యను మౌనంగా భరించ కుండా ముందుకు వచ్చి షీ టీమ్ ను సంప్రదించాలని సూచించారు.

ఎసిపి వెంకటరమణ మాట్లాడుతూ..

ప్రస్తుత సమాజంలో చిన్న వయసులోనే ప్రేమ అనే ట్రాక్ లో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని దాని వలన అటు తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా కుంగిపోవాల్సి వస్తుందని దయచేసి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు..

ఏదైనా మగవారి నుండి లైంగికంగా వేధించడం గాని ఇబ్బంది పెట్టడం గాని భయపెట్టడం గాని చేస్తుంటే ధైర్యంగా షీ టీంను సంప్రదించాలని తెలిపారు..

మహిళలు, విద్యార్థినులు ఆపద సమయంలో డయల్ 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712670759 ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎలాంటి వేధింపులకు గురైన అమ్మాయిలు మౌనంగా భరించవద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం ని సంప్రదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సిఐ స్వామి, ఎస్ఐ చేరాలు, పోలీస్ సిబ్బంది, కళాశాల జాయిట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found