పేకాట స్థావరం పై మెరుపు దాడి..
ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ఇంటిలో జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు వై.నారాయణ, ఏ ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడి చేయగా ఏడుగురు వ్యక్తులు జూదమాడుతూ కనిపించగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి 07 మొబైల్ ఫోన్స్, ప్లేయింగ్ కార్డ్స్ నగదు రూ. .30,000/- రూపాయలను సీజు చేసి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి వారిపై కేసు నమోదు చేశారని ఎల్లారెడ్డిపేట స్టేషన్ హౌస్ అధికారి మీడియా ప్రకటనలో తెలిపారు
