17వ పోలీస్ బెటాలియన్ లో ప్రజా కవి కాళోజి నారాయణ రావు జయంతిని పురస్కరించుకొని 17వ పోలీస్ బెటాలియన్ కార్యాలయం సర్దాపూర్ లో కాళోజి నారాయణరావు జయంతి ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమములో బెటాలియన్ ఇంచార్జ్ కమాండెంట్ శ్రీ యస్.శ్రీనివాస్ కాళోజి నారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అధికారులు, ఇతర పోలీస్ సిబ్బంది కాళోజి చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు.