ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 26, జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలో 1987-88 పదవ తరగతి పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆదివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా ఉపాధ్యాయులు పాల్గొని వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు ఈపాఠశాలలో చదివి 35 ఏళ్లు గడిచిపోయినప్పటికీ గత స్మృతులను తలచుకొని పాఠశాలలో సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థులు గురువులకు పాదాభివందనం చేస్తూ శాలువాతో సన్మానించారు. విద్యార్థులు అన్నిరంగాలలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో, వివిధ వృత్తులలో స్థిరపడిన పూర్వ విద్యార్ధులు తమ గత స్తృతులను నెమరువేసుకున్నారు. వృత్తిరీత్యా తమతమ జ్ఞాపకాలను స్టేజిపై గుర్తుచేస్తూ తాము చదువుకున్న పాఠశాలలో కలిసి తిరిగి తమ అనుబంధాలను స్మరించుకుని విందు చేసుకున్నారు. తమకుటుంబ నేపథ్యాలను, కష్టసుఖాలను గుర్తు చేస్తూ పూర్వ విద్యార్థులలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులలో ఉన్న మిత్రులకు సహాయసహకారాలను అందుకోవాలని కోరారు. మహిళా పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈకార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, బండారి శేఖర్, ఓరుగంటి తిరుపతి, పప్పుల శ్రీకాంత్, కొండ శ్రీనివాస్ గౌడ్, నల్ల బాపురెడ్డి, మట్ట వేనేశ్వర్ రెడ్డి, బొంగోని శ్రీనివాస్ గౌడ్, గూడూరు వేణు రావు, అల్లం లక్ష్మణ్, ఏదునూరి రామచంద్రం, రాజూరి శ్రీనివాస్, నాగరాజు, శ్యామ్ లు తదితరులు పాల్గొన్నారు.
