ప్రాంతీయం

జిల్లా అసోసియేషన్ సభ్యులలో ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు….

125 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఏప్రిల్ 17,  రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ్ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు సిరిసిల్లలో జరిగాయి ముస్తాబాద్ మండలము నామాపూర్ గ్రామానికి చెందిన పదిర బాలగౌడ్ కోశాధికారిగా పోతుగల్ గ్రామానికి చెందిన జిల్లెల్ల శ్రీనివాస్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి ఎన్నిక పట్ల ముస్తాబాద్ మండల గోపా సభ్యులు అభినందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సంఘపటిష్టతకు సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని మాపై పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్, డాక్టర్ రాజేందర్, కదిరే పరశురాములు, బాధ వేణి అంజయ్య, కంచర్ల రాములు గౌడ్, మేరుగు నాంపల్లి గౌడ్, దేవరాజు గౌడ్, లక్ష్మీపతి, అశోక్ , భుంపల్లి రాజు గౌడ్, బిక్షపతి గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *