రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వ్యక్తి పోలీసుల పేరు చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేస్తుండగా అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని పట్టణ సే ఉపేందర్ తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ…సిరిసిల్ల రెడ్డివాడ కు చెందిన గుడెల్లి సంతోష్ కుమార్ కొడుకు అయిన గుడెల్లి ప్రజ్ఞెష్ పధవ తరగతి చదువుతూ నాలుగు నెలల క్రితం ఆన్లైన్ OLX లో మోటార్ సైకల్ గురించి వెతుకుతుండగా యమాహా RX100 రూ:20,000/- లకు అమ్మకానికి కనబడగా దాని గురించి ఆకాశ్ అనే వ్యక్తిని అడుగగా మీకు బైక్ నడుపరాదు అని నేను వెళ్ళి తీసుకొని వస్తా అని మాయ మాటలు చెప్పి గుడెల్లి ప్రజ్ఞెష్ వద్ద నుండి ఆకాష్ రూ:20,000/- తీసుకొని వెళ్ళి తిరిగి వచ్చి బైక్ తీసుకొని వస్తుండగా పోలీసు వారు పట్టుకున్నారఅని తెలిపినాడు.
తరువాత కొన్ని రోజులకు ఆకాష్, ప్రజ్ఞెష్ వద్ద అవసరము ఉన్నది అని కేమరా తీస్కోని వెళ్ళినాడు. తరువాత జూన్ నెలలో ఫిర్యాది కొడుకు వద్దకు వచ్చి OLX లో తిస్కున్న బండి విషయములో కేసు పెట్టనాని చెప్పి పోలీసు వారు డబ్బులు అడుగుచున్నారు.
అని భయబ్రాంతులకు గురి చేసి రూ:13000/- లు తీసుకొని వెళ్ళి కేసు నుండి పోలీసు కేసు తీసివేయడానికి కేమర కుదవపెట్టినాను అని చెప్పగా ప్రజ్ఞెష్ నమ్మక కేమర మరియు డబ్బులు అడుగగా నిందితుడు తనకు రూ:40,000/- లు ఇస్తే నే కేమర ఇస్తా అని బెదిరిస్తున్నాడని ప్రజ్ఞెష్ సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆకాష్ పైన కేసు నమోదు చేయనైనదాని సీఐ పేర్కొన్నారు.