నేరాలు

బైక్ దొంగకు ఎనిమిది నెలల జైలు శిక్ష

124 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పెద్దవేని భాస్కర్ అనే వ్యక్తికి సంబంధించి చక్రవాహనం పోయినవని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా మంగళవారం రోజు బైక్ దొంగకు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.

మండల కేంద్రానికి చెందిన భాస్కర్ కు చెందిన ద్విచక్ర వాహనం ఐదో నెల 29వ తారీఖున గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు కొనసాగించిన పోలీసులు తంగళ్ళపల్లి మండలం కు చెందిన సద్ద చింటూ అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకొని విచారించి కోర్టు ముందు హాజరు పరచగా విచారణ చేపట్టిన కోర్టు వారు మంగళవారం రోజు 8 నెలల జైలు శిక్ష విధించినట్లు తీర్పునిచ్చారని పోలీసులు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *