సిరిసిల్ల జిల్లాలో సెప్టెంబర్15వ తేదీన నిర్వహించబోయే టెట్ పరీక్షలను పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఐ.డి. ఒ సి. లోని తన ఛాంబర్ లో టెట్ పరీక్షల నిర్వహణ,ఏర్పాట్ల పై జిల్లా అదనపు కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ పరీక్షలు 15వ తేదీన ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ పేపర్ పరీక్షలు నిర్వహించనున్నామన్నారు.
జిల్లాలో మొదటి పేపర్ కు 3378 మంది విద్యార్థులు,రెండోవ పేపర్ 2937 మంది హాజరుకానున్నారని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లాలోనీ సిరిసిల్ల పట్టణంలో మొదటి పేపర్ వ్రాసేవారికి 15 సెంటర్లు, సెకండ్ పేపర్ వ్రాసేవారికి కొరకు 14 సెంటర్లు ఏర్పాటు చేసామన్నారు.