(తిమ్మాపూర్ అక్టోబర్ 19)
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నియమాలను అందరు తప్పకుండా పాటించాలని సిఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు..
తిమ్మాపూర్ సర్కిల్ కార్యాలయంలో తిమ్మాపూర్ సర్కిల్ పరిధిలోని ఎల్ఎండి కాలనీ , చిగురుమామిడి, గన్నేరువరం ఎస్ఐ లతో కలిసి మూడు మండలాలకు సంబందించిన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం, ఇతర ఎన్నికల సంబంధిత అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ…
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రచారం జరుపుకోవాలని తగు సూచనలు చేస్తూ ఎన్నికల ప్రచారం, ర్యాలీలు తదితర కార్యక్రమాల కోసం సంబంధిత అధికారులను సంప్రదించి నిబంధనల ప్రకారం నిర్వహించుకోవాలని ఇతర పార్టీల వారిని కించపరిచే విధంగా మనోభావాలను దెబ్బతీసేలా నేరుగాకానీ,వివిధ ప్రసార మాధ్యమాల్లో కానీ, వ్యవహరించ కూడదని ఎవరైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.