రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ కృష్ణ జన్మాష్టమిని వేడుకలు పురస్కరించుకొని మండల వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ ప్రవేట్ పాఠశాల ఆధ్వర్యంలో పాఠశాలలో చిన్నారులు రాధకృష్ణుని వేషాధరణతో అలరించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను గోపిక,కృష్ణులుగా అలకంరించి స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని అంత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థినిలు, ఉపాధ్యాయులు, చిన్నారుల తల్లిదండ్రులు, తదితరులు ,పాల్గొన్నారు.