మంచిర్యాల జిల్లా
మంచిర్యాల శాసనసభ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో ఇన్ వార్డు, అవుట్ వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారి దగ్గరకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. వైద్య సేవలు బాగున్నాయా మందులు ఇస్తున్నారా సిబ్బంది పని తీస్తూ బాగుందా అంటూ ఆరా తీశారు. వైద్యులు, సిబ్బందిని కలిసి వారికి ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిపై నమ్మకంతో వచ్చే నిరుపేదలకు ఉన్నతమైన అన్ని రకాల వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహించవద్దని సూచించారు. ఆసుపత్రి మొత్తం కలియ తిరుగుతూ పరిస్థితి ని గమనించారు.
కార్పొరేట్ స్థాయిలో వైద్యం
మంచిర్యాలలో నూతన ఆసుపత్రుల నిర్మాణంతో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు ఇక్కడే లభిస్తాయని మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లకుండా అదే స్థాయిలో ఇక్కడ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు ఉంటాయని ఆయన తెలిపారు. వచ్చే ఏడాదిన్నరలో ఐబీ స్థలంలో ఆసుపత్రి భవనం ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు ఆరంభమైతే మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ , పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి మంచిర్యాల ఆసుపత్రికి వైద్యం కోసం వస్తారని చెప్పారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ సుదూర ప్రాంతాలకు ఎవరు వెల్లె పరిస్థితి రాదని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ ఆసుపత్రిలో సమస్యలు ఉన్నప్పటికీ వైద్యులు సిబ్బంది వచ్చిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారన్నారు.





