ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి8, మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ముస్తాబాద్ మండలంలో మహిళలు ప్రపంచ మహిళ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా మహిళా మండలి గ్రూప్ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకుల ద్వారా పావులవడ్డీ రుణం పొందిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మహిళలకు నేరుగా వారి అకౌంట్లలోకీ (750) కోట్లు వచ్చే విధంగా ప్రోసిడింగ్ కాఫీలు వచ్చాయని ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతి తెలిపారు. పై విషయాన్ని పురస్కరించుకొని మండలంలోని మహిళలు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ కస్తూర్బా పాఠశాలలో మొక్కలు నాటి సంతోషం వ్యక్తంచేశారు . ఈకార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, శీలం జానాబాయ్, కుర్ర సావిత్రి, దబ్బెడ రేణుక, కంచం మంజుల, స్వర్ణ, నవీన, బాల లక్ష్మి, అన్ని గ్రూపుల మహిళలు, ఎంపీపీ జనగామ శరత్ రావు, గుండం నరసయ్య, బొంపల్లి సురేందర్ రావు, సందుపట్ల అంజిరెడ్డి, బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
