ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట గ్రామానికి చెందిన మోకనపల్లి సుమన్ (26)అనే యువకుడు రోడ్డు ప్రమాదం లో సెప్టెంబర్ 01 వ తేదీ నా మరణించాడు.శోకసముద్రమైన కోరుట్ల పేటలోని స్మశానవాటిక లో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ఆ బాదితకుటుంబాన్ని మంగళవారం వెళ్లి పరామర్శించారు. కన్నీటిపర్యంతమైన సుమన్ తల్లి నర్సవ్వ, తండ్రి నర్సయ్య లను ఓదార్చారు, ఈ సందర్భంగా వారికి ఖర్చులు నిమిత్తం 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు అందజేశారు,
బాధిత కుటుంబాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, స్థానిక ఎంపిటీసీ సభ్యులు సింగారం మధు, ఎఎంసి మాజీ చైర్మన్ అందె సుభాష్, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, కోరుట్ల పేట గ్రామ శాఖ బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బాలమల్లు , బిఆర్ ఎస్ పార్టీ నాయకులు పిల్లి కిషన్, సురభి కాంతారావు, ప్రమోద్,కాంపెల్లి కిష్టయ్య , రామాగౌడ్ లు వెళ్లి పరామర్శించారు,