అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ దాటబోతున్నాం
-హోంమంత్రి మహ్మద్అలీ
(మానకొండూర్ నవంబర్ 23)
అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా మానకొండూరు కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర హోంశాఖ మాత్రులు మహ్మద్ అలీ మాట్లాడారు….
2014కు ముందు 2014 తర్వాత కరెంటు కోతలు, రైతు ఆత్మహత్యలు సాగునీటి కొరత , త్రాగునీటి కొరత 2014 తర్వాత 24 గంటల కరెంటు ప్రాజెక్టుల నిండా నీళ్లతో రైతుల సుభిక్షంగా ఉండి పంటలను పండిస్తున్నారు..
ఇది తెలంగాణలో కేసీఆర్ సాధించిన విజయమని అన్నారు..
ముస్లిం యువకులు ఆటోలు తోలుకోవడం కార్ఖానాలలో పని చేసేవారని ముస్లిం మైనారిటీల కోసం మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశాడని, దీనివల్ల మైనారిటీల పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లుగా మారుతున్నారని పేర్కొన్నాడు..
కెసిఆర్ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ లీడర్ అని తన విజనరీ తో తెలంగాణ రూపురేఖలు మార్చి ప్రజల జీవితాలలొ మార్పులు తీసుకువచ్చాడని అన్నారు..
ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ కు ఓటు వేయవద్దు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి అని కాంగ్రెస్ 50 సంవత్సరాల పాలనలో ముస్లింలు ఏ విధంగా అభివృద్ధి చెందలేదని అలాంటి పార్టీకి ఓటు వేయకూడదని, మన కొండూరు నియోజకవర్గంలో రసమయి బాలకిషన్ తన కొడుకులాంటి వాడని రసమయి బాలకిషన్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరాడు..
రానున్నా అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డీజిట్ కే పరిమితం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు..
ఈ కార్యక్రమంలో మానకొండూర్ మండల జెడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచ్ పృధ్విరాజ్, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..




