రాజన్న సిరిసిల్ల జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా యాదవ సంఘం నాయకులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కొమురయ్య ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ను అక్కడి నుండి వేరు చేసి సిరిసిల్ల జిల్లా కు కేటాయించాలని కోరారు.రెండవ విడత గొర్రెల పంపిణీ నీ వేగవంతం చేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి నీ కోరారు.ఈ సందర్భంగా జిల్లా పశు సంవర్దక వైద్యాధికారి కొమురయ్య తనను కలిసిన యాదవ సంఘం నాయకులతో మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలతో కలిపి 189 గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం లు ఉన్నాయని 1752 డిడి లు వచ్చాయని 4628 డి డి లు కట్టాల్సి ఉందనీ అన్నారు.
