ఏ ఇంట్లో వర్షపు నీరు,మంచినీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పంచాయితీ, వైద్య ఆరోగ్య శాఖ క్షేత్ర సిబ్బందికి సూచించారు. మంచి నీరు లోనే డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయనీ అన్నారు.
మంగళవారం డ్రై డే ను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ తంగల్లపల్లి రాళ్ల పేట గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య తనిఖీలు చేశారు.గ్రామంలోని ఇండ్లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఇండ్లలో, ఇంటి అవరణలో నీరు నిల్వ ఉందా?నిల్వ నీటిలో లార్వా ఉన్నది, లేనిది పరిశీలించారు.
ఇంటింటికి తిరిగి ఇంట్లో, పరిసరాలను పరిశీలిస్తూ, నీటి నిల్వలను తొలగిస్తూ ప్రజలకు కలెక్టర్ అవగాహన కల్పించారు.మిషన్ భగీరథ నీరు వస్తుందా?చెత్త సేకరణ వాహనం రోజూ మీ ఇంటికి వస్తుందా?మీ ఇంట్లో ఎవరికైనా చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరాలు వచ్చాయా ?అంటూ ప్రజలను ప్రశ్నించారు.
క్షేత్ర పర్యటనలో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, ఆర్డీఓ ఆనంద్ కుమార్,జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, జిల్లాపంచాయితీ అధికారి రవీందర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్ర శేఖర్, తదితరులు ఉన్నారు.