విమర్శలు మాని శాశ్వత పనులు చేపట్టండి మండల కాంగ్రెస్ కమిటీ .
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీ విమర్శలు మాని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆదివారం తెలిపారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలం నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు అలాగే కొంతమంది ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించలేనందుకు క్షమించమన్నారు బిఆర్ఎస్ పార్టీ రైతులకు భవిష్యత్తులో భావితరాలకు ఉపయోగపడే మల్కపేట లీడర్ ఛానల్ కాలువ ద్వారా వచ్చే నీటిని సింగసముద్రం నర్మాల ప్రాజెక్టుకు నీటిని తేవాలన్నారు అలాగే ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేయాలన్నారు మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో కర్మగారాలను స్థాపించి యువతకు ఉపాధిని కల్పించాలన్నారు ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ కార్యదర్శులు లింగం గౌడ్ వంగ గిరిధర్ రెడ్డి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహెబ్ జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి నాయకులు గంట బుచ్చగాడు కొత్తపల్లి దేవయ్య మల్లారెడ్డి గంగయ్య రామ్ రెడ్డి చెన్ని బాబు దండు శ్రీనివాస్ పరుశరాములు రాజేందర్ చెరుకు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు




