వర్షాకాలంలో వాతావరణ శాఖ జారీ చేసే రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ అంటే ఏంటి?
ఏవి ఎప్పుడు జారీ చేస్తారు.వర్షాలు కురిసినప్పుడు పసుపు (యెల్లో అలెర్ట్ ),నారింజ (ఆరంజ్ అలెర్ట్ ), ఎరుపు రంగు (రెడ్అ లెర్ట్ )వార్నింగ్స్ ఇస్తుంటుంది వాతావరణ శాఖ. అసలేంటా రంగులు, ఏ రంగు దేనికి దేనికి సూచన, మనం ఏ రంగు వార్నింగ్ వచ్చినప్పుడు అప్రమత్తమవ్వాలి? వాతావరణ పరిస్థితుల తీవ్రతను తెలియజేయడానికి భారత వాతావరణ శాఖ (IMD) రంగుల విధానాన్ని ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణ శాఖ వీటిని ప్రకటిస్తుంది. ఇలా రంగుల రూపంలో చెబితే ఎక్కువ మందికి సులభంగా విషయం అర్థమవుతుందనేది దీని ఉద్దేశం. దానికి తగ్గట్టుగా తర్వాతి పరిస్థితిని అర్థం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. తొలి రోజుల్లో ఆకుపచ్చ రంగు, పసుపు, నారిజం, ఎరుపు అంటూ నాలుగు రకాల రంగులు వాడేవారు. ఆకుపచ్చ అంటే ఎలాంటి చర్యలు అవసరం లేదని, పసుపు అంటే సిద్ధంగా ఉండమని, నారింజ అంటే సంసిద్ధులుకండి అని, ఎరుపు అంటే చర్యలు తీసుకోమని అర్థం.
ఈ రంగుల కేటాయింపును ఐఎండీ ఐదు రోజుల వాతావరణ స్కీమ్ ఆధారంగా నిర్ణయిస్తూ ఉంటుంది. మెట్రోలాజికల్ అంశాలు, హైడ్రోలాజికల్ అంశాలు, జియోఫిజికల్ ఫ్యాక్టర్స్ పరిగణలోకి తీసుకొని వర్షాల తీవ్రతను అంచనా వేసి అందుకుతగ్గ రంగు హెచ్చరికలు జారీ చేస్తారు. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఇదే కలర్ కోడ్‌ను వినియోగిస్తారు. అయితే ఆ హెచ్చరికతో పాటు ఇచ్చే సబ్ డివిజనల్ హెచ్చరిక మాత్రం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది.
వర్షం పడే అవకాశం లేని సమయాల్లో వాతావరణ శాఖ ఆకుపచ్చ రంగును చూపిస్తుంది. అంటే అది ఆటోమేటిక్‌గా ఉంటుందన్నమాట. వర్షం పడే సూచనలు ఉంటేనే ఆకుపచ్చ నుంచి రంగు మారుతుంది.
ఎల్లో అలర్ట్ అంటే ప్రజలను అప్రమత్తం చేయడానికి ఇస్తారు. డేంజర్ రాబోతోందని సూచనగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అంటే దాని ఉద్దేశం అలర్ట్ గా ఉండమని చెప్పడం. 7.5 మి.మీ నుంచి 15 మి.మీ మధ్య వర్షపాతం సుమారు గంట నుంచి రెండు గంటల వరకు పడే అవకాశం ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్ ఇస్తారు.