ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి కార్యాలయాల సముదాయం జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయల దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ఉపాధ్యాయులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈసందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన (4) మంది ఉపాధ్యాయులను సన్మానించారు.
తల్లిదండ్రులు జన్మనిస్తే, భవిష్యత్తును ఇచ్చేది గురువేనని పేర్కొన్నారు. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు గురుతర భాధ్యతను నిర్వహిస్తున్నారని జడ్పిటిసి అన్నారు.