రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి మమత దంపతులను స్థానిక పద్మశాలి సంఘం మహిళలు మార్కండేయ ఆలయంలో సోమవారం రోజు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎల్లారెడ్డిపేట గ్రామాన్ని రాష్ట్రాల స్థాయికి తీసుకెళ్లి ఇటీవల ఢిల్లీలో జాతీయ ఉత్తమ సేవా పథకం అందినందుకు చాలా గర్వకారణం అని అన్నారు. ఈ అవార్డు మన ఎల్లారెడ్డిపేట గ్రామ సర్పంచ్ కి రావడం పట్ల మా పద్మశాలి మహిళా సంఘ సభ్యులు ఆధ్వర్యంలో ఈ దంపతులకు సన్మానించడం జరిగిందని వారు అన్నారు. అలాగే మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అవార్డులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.