*ఆరోగ్య అలంపూర్ కోసం ఆర్.వి శేషు పోరాటం సంతకం చేద్దాం కర్నూలులో ఆరోగ్యశ్రీని సాధిద్దాం..
20000 మందితో సంతకాల సేకరణ చంద్రశేఖర్ నగర్ మానవపాడు మండలంలో ప్రారంభించిన ఆర్ వి శేషు.
పేద ప్రజల ఆరోగ్య సంజీవని ఆరోగ్యశ్రీ కర్నూలులో సాధించేవరకు పోరాటం తప్పదు ఆర్ వి శేషు,
*సొంత ప్రయోజనం ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయడం నేర్చుకోండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేకి ఇతవు పలికిన ఆర్ వి శేషు…*
తెలంగాణ రాష్ట్రానికి చివరి ప్రాంతమైన నడిగడ్డ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గాల ప్రజలు అనారోగ్య సమస్యలతో కర్నూలు మీద ఆధారపడవలసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఆరోగ్యశ్రీ చిన్నగా కనీసం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కూడా ఆరోగ్యశ్రీ వెసులుబాటు లేక వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ మధ్య తరగతి పేద ప్రజల ఆరోగ్యం దుస్థితి చూడలేక కనీసం వారి బాధను ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఆరోగ్యశ్రీని కర్నూలులో సాధించే వరకు పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది అని ఆర్ వి శేషు తెలిపారు.



