*రామగుండం పోలీస్ కమీషనరేట్*
రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా యూనిట్ ల వారిగా టాప్ 10 ఎంపికలో రామగుండం పోలీస్ కమీషనరేట్ కు మూడవ స్థానం.
రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా పోలీస్ స్టేషన్ ల వారిగా టాప్ 10 ఎంపిక లో అంతర్గం పోలీస్ స్టేషన్ కు మూడవ స్థానం
ప్రజలకు, బాధితులకు మెరుగైన సేవలను అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ పోలీస్ శాఖ గురించి, స్టేషన్లలోని సిబ్బంది గురించి ప్రజలేమనుకుంటున్నారు? పోలీస్ స్టేషన్లలో ప్రజలకు సరైన ఆదరణ, సేవలు లభిస్తున్నాయా, ఫిర్యాదుదారులతో సిబ్బంది ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఓ క్యూఆర్ కోడ్‌ను రూపొందించారు. QR కోడ్ & CFC ద్వారా పోలీసు సేవలపై ప్రజల నుండి వచ్చిన మొత్తం అభిప్రాయాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ డిజిపి ఆదేశాల మేరకు టాప్ 10 యూనిట్ లను ఎంపిక చేయడం జరిగింది అందులో యూనిట్ ల వారిగా రామగుండం పోలీస్ కమీషనరేట్ మూడవ స్థానం సాధించడం జరిగింది. అదేవిదంగా రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ & సిటీజన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా పోలీస్ స్టేషన్ ల వారిగా టాప్ 10 ఎంపికలో పెద్దపల్లి జోన్ అంతర్గం పోలీస్ స్టేషన్ మూడవ స్థానం సాధించడం జరిగింది. ఇట్టి అవార్డు లను గౌరవ డిజిపి శ్రీ జితేందర్ చేతుల మీదుగా కమీషనరేట్ తరుపున మంచిర్యాల డీసీపీ శ్రీ భాస్కర్ ఐపిఎస్., అంతర్గం ఎస్ఐ వెంకట్ లు అందుకోవడం జరిగింది.
సమాజానికి వారు వారి అంకితభావంతో కూడిన అమూల్యమైన సేవ అందిచడం మరియు పోలీసులు ప్రజలకు సేవలను మెరుగుపరచడానికి వీలు కల్పించింది అని రాష్ట్ర వ్యాప్తంగా ఇట్టి గుర్తింపు పొందడానికి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పోలీస్ మీకోసమే ఉన్నదనే భరోసా నమ్మకం కల్పిస్తూ విధులు నిర్వహిస్తూన్న పోలీస్ అధికారులను, సిబ్బంది నీ రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్యూఆర్ కోడ్ రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోనీ అన్ని పోలీస్ స్టేషన్లలో, ఉన్నతాధికారుల కార్యాలయాల వద్ద, సోషల్ మీడియా, పోలీస్ వెబ్‌సైట్లల్లో అందుబాటులో ఉంటుందని క్యూఆర్ కోడ్‌ను ప్రజలు స్కాన్ చేస్తే అందులో పోలీసుల పనితీరు గురించి ప్రశ్నలు ఉంటాయని వాటికి సమాధానాలు టైప్ చేసి పంపాలని లేదా వాయిస్ ద్వారా అయినా సమాధానం పంపవచ్చు అని అదే విధంగా ఎఫ్‌ఐఆర్ గురించి, ఈ చలాన్ (ట్రాఫిక్ ఉల్లంఘనలు), పాస్‌పోర్టు ధ్రువీకరణ, ఇతర అంశాలపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని సీపీ తెలిపారు. ప్రస్తుత పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయాలు విశ్లేషించి వాటి ఆధారంగా పోలీస్ సేవల ప్రమాణాలు మెరుగుపర్చకొని తద్వారా పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం ముఖ్య ఉద్దేశ్యమని కావున ప్రజలు తమ అభిప్రాయంలను, సలహాలు, సూచనలు తెలపగలరు అని ఈ సందర్బంగా సీపీ సూచించారు.





