రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ఆవునూరి శివ 32 అనే వ్యక్తి దినసరి కూలీగా పని చేస్తూ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షుడు బండారి బాల్రెడ్డి తో సోమవారం 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఇతని ఆర్థిక పరిస్థితి ఇంతంత మాత్రాన్ని ఉండగా కనీసం ఉండడానికి ఇల్లు లేని కడు నిరుపేదరికంతో కొట్టు మిట్టాడుతున్న అతని మృతునికి భార్య శ్రావణి,7 ఏళ్ల ప్రణయ్ అనాధలుగా మిగిలారు.దాతల సహాయంతో అంత్యక్రియలు ఆదివారం పూర్తి చేశారు.ఈ కార్యక్రమంలో లద్దు నూరి తిరుపతి యాదవ్, ఎలగందుల నర్సింలు, ఎడ్ల సందీప్, కోడిమోజు దేవేందర్, గంట వెంకటేష్ గౌడ్, అశోక్, స్వామి,రాజం తదితరులు పాల్గొన్నారు.