రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామానికి చెందిన గొర్రె మల్లయ్య -ఎల్లవ్వ ల ఒక్కగానొక్క కుమార్తె స్రవంతిని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి గ్రామానికి చెందిన నక్క ప్రణీత్ కు ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం చేశారు.
వీరికి 3 సంవత్సరాలు కొడుకు ,7 నెలల కూతురు ఉన్నారు.ప్రణీత్ కు తల్లిదండ్రులు లేకపోగా ఉండడానికి ఇల్లు, భూమి కూడా లేని నిరుపేద కుటుంబం వారిది. ప్రణీత్ కూలి నాలి చేసుకుంటూ భార్యా పిల్లలను పోషించుకుంటున్నాడు.
గత కొన్ని నెలల నుండి ప్రణీత్ కు రెండు కిడ్నీలు చెడిపోయాయి ఆస్పత్రులకు వెళ్దామంటే చేతిలో చిల్లి గవ్వ లేదని మెరుగైన వైద్యం చేయించుకుందామంటే డబ్బులు లేక తన అత్తగారిల్లయిన రాగట్లపల్లిలో ఉంటున్నాడు. ప్రణీత్ కు రెండు కిడ్నీలు చెడిపోయిన విషయాన్ని తెలుసుకున్న స్రవంతి తోటి స్నేహితులు 2013-14 బ్యాచ్ కు చెందిన వారు సోమవారం 9800 రూపాయలను రాగట్లపల్లికి వెళ్లి వారికి అందించి అండగా నిలిచారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాల్సిందిగా తోటి మిత్రులు కోరారు.ఆర్థిక సాయం అందించిన వారిలో ఒగ్గు నగేష్, చందుపట్ల ప్రేమ్ చందు,సతీష్ దోమల వెంకటేష్ ఉన్నారు.