కేసీఆర్ ను విమర్శించే స్థాయి సీతక్కకు లేదు
- మూ
ట ముల్లె సర్దుకుని వెళ్లేందుకు రెడీగా ఉండ
ములుగులో చేసిన అభివృద్ధి అంతా బీఆర్ఎస్ దే
సొంత ఊరులో కూడా సీతక్క చేసిన అభివృద్ధి ఏం లేదు
మీరు చేసిన అభివృద్ధి,నేను చేసిన అభివృద్ధి ఏంటో తెలుసుకుందాంరా
,ములుగు, నవంబర్ 25:
కెసిఆర్ ను విమర్శించే స్థాయి ములుగు ఎమ్మెల్యే సీతక్కకు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. కనీసం సీతక్క తన సొంత ఊరు లో కూడా పూర్తిస్థాయిలో మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయిందని అన్నారు. తను సర్పంచ్ గా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ములుగులో తాను చేసిన అభివృద్ధి ఏంటో.. 20 ఏళ్లు రాజకీయ లో ఉన్న సీతక్క చేసిన అభివృద్ధి ఏంటో…చెప్పాలని సవాలు చేశారు. ములుగు నియోజకవర్గం లో ఎవరు ఏమి అభివృద్ధి చేశారో తెల్చుకుందామని సవాల్ విసిరారు. గట్టమ్మ సాక్షిగా సవాల్ స్వీకరించాలని నాగజ్యోతి అన్నారు. శుక్రవారం ఇంటింటి ప్రచారంలో భాగంగా ములుగు పట్టణంలో వాణిజ్య సముదాయాల్లో వ్యాపారస్తులను కలుస్తూ ఓట్లను అర్ధించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ ములుగు జిల్లాను ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్కే దక్కుతుందని, మల్లంపల్లి మండలం ప్రకటన, ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ను కేసీఆర్ ఏర్పాటు చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ శ్రీదేవి దివంగత మంత్రి చందూలాల్ తనయుడు ధరం సింగ్, మాజీ ఎంపీపీ మసర గాని వినయ్ కుమార్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్,ఉపాధ్యక్షులు శరత్, తదితరులు పాల్గొన్నారు.