రాజకీయం

మరోసారి గెలిపించండి…. మరింత అభివృద్ధి చేస్తా….

216 Views

తిరుమలాయపాలెం నవంబర్ 21 :కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా : కందాళ.

తిరుమలాయపాలేం మండలం, హైదర్ సాయిపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి

ఈ సందర్భంగా మాట్లాడుతూ గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని, కేసిఆర్ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమలు చేశారన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బందు, బీసీ బందు, కేసీఆర్ కిట్టు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతినెల 3 వేల రూపాయకు అందిస్తామని, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛను 6వేలకు, రైతుబంధును 16 వేలకు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడంతో పాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామన్నారు.ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *