క్షణంలో బతికి బయట పడ్డాడు.. షాకింగ్ వీడియో
అతి నిర్లక్ష్యం ప్రాణాలను హరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ యువకుడు రైల్వే క్రాసింగ్ వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరించగా, భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ వీడియోను తాజాగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేశారు. ‘వెంట్రకవాసిలో బతికి బయటపడ్డాడు! వాహనాలను నడిపేటప్పుడు ఓపిక చాలా అవసరం. ఇలా తొందరగా వెళ్లాలనే ఆత్రం ఏమాత్రం పనికి రాదు’. అని పేర్కొన్నారు. ఏ ఊరిలో ఎక్కడ జరిగిందో వివరాలు తెలియరాలేదు. ఏది ఏమైనా ప్రాణాలను అరి చేతిలో పెట్టుకొని బయటపడ్డాడు
