రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నుకున్న వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఎలుసాని మోహన్, డైరెక్టర్ బొమ్మన
వేణి సత్యంను ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో సన్మానించారు.
బొప్పాపూర్ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీకి,కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజకీయ అనుభవం ఉన్న ఎలుసాని మోహన్ ను బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కి చైర్మన్గా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందని, బొప్పాపూర్ గ్రామంలో అత్యధికంగా రైతులు వరి ధాన్యాన్ని పండిస్తున్నారని, అట్టి వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి రైతుల సమస్యలు ఎప్పటికి అప్పుడు పరిష్కరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా కేబినెట్ మెంబర్ అధ్యక్షులు వంగాల రవీందర్, నిమ్మల కిషన్, మరియు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.