మల్లంపేట్ లో పాదయాత్ర చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ 22వ వార్డు మల్లంపేట్ జీఎల్సీ లే అవుట్ లో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ఈరోజు పాదయాత్ర చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్బంగా స్థానికంగా ఏర్పాటు చేసుకున్న చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.*





