రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో బిఆర్ఎస్ పార్టీ మున్నూరు కాపు పటేల్ కులంతో రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉపసర్పంచ్ సిరిపురం మహేందర్ ఆదివారం అన్నారు.ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ వీడినట్లు ప్రకటించగానే బిఆర్ఎస్ పార్టీ మున్నూరు కాపు పటేల్ నాయకులకు ఎక్కడలేని ప్రేమను ఒలకపోస్తున్నారని అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో మీరు బిఆర్ఎస్ పార్టీలో మీ క్యాడర్ ఎంతవరకు ఉందో ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలని అన్నారు.
మీ పార్టీ నుండి ఎంతమంది ఎన్ని కులాలకు చెందినవారు వెళ్లిపోయిన తప్పు ఉండదు కానీ ఇతర పార్టీల నుండి వెళ్లిపోతే అది పెద్ద పొరపాటు అయినట్లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు చంకలు గుద్దుకోవడం మీ స్థాయిని తెలియజేస్తుందన్నారు. ఈ సమావేశంలో సిరిపురం నరేందర్ ఉప్పుల రవి అంబూరి బాబు సచిన్ తదితరులు పాల్గొన్నారు
