వర్దన్నపేట మండలం సెప్టెంబర్ 25
ప్రమాద వశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు 2లక్షల రూపాయల ఆర్థిక సహాయం
వర్దన్నపేట మండలం ఇల్లంద గ్రామానికు చెందిన సాతుపల్లి ఉప్పస్వామి గారు రోడ్డు ప్రమాదంలో మరణించారు. టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వీరికి పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా క్రియాశీల సభ్యత్వం ద్వారా 2లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును అందచేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్కి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
