రాజకీయం

మీడియా స్వేచ్ఛకు భంగం కల్గిస్తే ఊరుకోం !

77 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 27)

– టీయుడబ్ల్యుజే (ఐజేయూ) హెచ్చరిక
– ఐటీడీఏ పీవో, ఏఎస్పీ, ఆర్డీవోలకు వినతిపత్రాలు

మీడియా స్వేచ్ఛకు, పాత్రికేయుల హక్కులకు భంగం కల్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీయుడబ్ల్యుజే(ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.వి.రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మొబగాపు ఆనంద్కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీహరిలు హెచ్చరించారు. ఇటీవల ఇసుక రీచ్ల్లో అక్రమాలపై కవరేజీకి వెళ్లిన మీడియాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, చర్లలో అధికారులు తప్పుడు ఫిర్యాదులు చేసి, ఇసుక రీచ్ల్లోకి మీడియా రావొద్దంటూ అల్టిమేటం జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. భద్రాచలంలో బుధవారం ఐటీడీఏ పీవో ప్రతీక్జైన్, ఏఎస్పీ ఆఫీసులో, ఆర్డీవో దామోదర్కు మీడియా స్వేచ్చకు, పాత్రికేయుల హక్కులకు భంగం కల్గించే వారిపై చర్యలు తీసుకోవాలని, పాత్రికేయులకు రక్షణ కల్పించాలంటూ వినతిపత్రాలు సమర్పించిన అనంతరం వారు మాట్లాడారు. రైజింగ్ కాంట్రాక్టర్లు కొందరు అమాయక ఆదివాసీల సొసైటీ సభ్యులను రెచ్చగొట్టి మీడియాపై దాడులకు పురిగొల్పడం దారుణం అన్నారు. తమ అక్రమాలను వెలుగులోకి తెస్తున్నందుకే అక్కసుతో ఇలాంటి బరితెగింపు కార్యక్రమాలకు ఒడిగడుతున్నట్లుగా వారు అభిప్రాయపడ్డారు. ఇసుక, గ్రావెల్, కంకరలను అడ్డగోలుగా పీసా, వాల్టా చట్టాలను తుంగలో తొక్కి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న కాంట్రాక్టర్లు మీడియాపై అవాకులు, చవాకులు పేలడం తగదని హెచ్చరించారు. ఇలాంటి అక్రమార్కులకు కొమ్ముకాస్తూ మీడియాను బెదిరిస్తున్న ఆఫీసర్ల పైనా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ ఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.మీడియాపై బెదిరింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేంత వరకు దశలవారీగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సీనియర్ సభ్యులు పిల్లి రాజు, సత్యానంద్, ఎర్రంశెట్టి కృష్ణ,రాజాకిరణ్, నాయుడు, సతీష్, దుర్గారెడ్డి, తమ్మళ్ల రాజేశ్, బాలాకిరణ్, వాసు, జయరాం తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్