- వేములవాడ – జ్యోతి న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ చేయటం జరిగింది అని ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధి గా కరీంనగర్ నూతన అదనపు సీనియర్ సివిల్ జడ్జి యువరాజు పాల్గొని భక్తుల కు ప్రతిమలు అందించారు మరియు వేములవాడ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ దిలీప్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ పర్యావరణంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి అని నీరు ప్రతీ ప్రాణికి అత్యంత ఆవశ్యకం అని ప్లాస్టర్ అఫ్ పారిస్ వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది అని,గత కొన్ని సంవత్సరాలు గా మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంచటం జరుగుతుంది అని ఇటీవల ప్రజలకు అవగాహన పెరగడంతో క్రమంగా మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్టించేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు అని పర్యావరనాన్ని రక్షించే దిశగా ఇది మా వంతు ప్రయత్నం అని గత కొన్నేళ్ళుగా ఉచితంగానే మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాము అని,పర్యావరణాన్ని కాపాడుకోవటం ప్రతీ ఒక్కరి భాద్యత అని భావితరాలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే ఇప్పటి నుండి పిల్లలకు కాలుష్యం మీద అవగాహన కల్పించాలని, ప్రజలు వినాయక నవరాత్రులను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఫౌండేషన్ సభ్యులు పూజిత, సుప్రియ, వేణు, వంశీ, బండి సాయికిరణ్, దూలం రామ్ కుమార్, తడుక గణేష్, వెంకట్ సాయి, రాజు, రాహుల్, శివ, నితిన్, హేమంత్ మరియు భక్తులు,
తదితరులు పాల్గొన్నారు.
