రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి. పత్తి చేను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారిని శిక్షించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన గోవుల రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని నర్సింగ్ హోమ్ లో క్రిమిసంహారక మందు త్రాగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న గోవుల రమేష్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు గత 16 సంవత్సరాలుగా కంచర్ల గ్రామ శివారులో గల నాలుగు ఎకరాల భూమిని రమేష్ కుటుంబం దున్నుకుంటూ పంట పండించుకుని జీవనం కొనసాగిస్తున్నారు ఇటీవల గ్రామంలోని కొంతమంది పెద్ద మనుషులు వేములవాడ పరిధిలోని ఫారెస్ట్ సెక్షన్ అధికారి శ్రీనివాస్ తో కుమ్మక్కై రమేష్ పొలాన్ని ఏ విధంగానైనా కాజేయాలని ప్రయత్నించడం జరుగుతుందన్నారు గతంలో పనిచేసిన ఫారెస్ట్ అధికారులు ఎవరూ కూడా రమేష్ అధీనంలో ఉన్న ఆ భూమిని ముట్టుకోలేదని పైగా రమేష్ వాళ్ళ నాన్న నక్సలైట్ల చేతిలో హతమయ్యాడని అప్పటి పోలీస్ అధికారులు రమేష్ కు ఈ నాలుగు ఎకరాల భూమి ఇవ్వడం జరిగిందని రమేష్ భార్య భారతి తల్లి నరసవ్వ తెలిపారు వీర్నపల్లి మండలంలో పోడు భూముల సమస్యను స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు పరిష్కరించడం లేదని అన్నారు ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ పట్టించుకోని వీర్నపల్లి మండలంలో గల పోడు భూములను గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలన్నారు లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పోడు భూముల రైతులకు పట్టాలి ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్. కార్యదర్శి లింగం గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి. జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి నాయకులు రాజు నాయక్. పోచయ్య చిన్ని బాబు ఎండి జుబేర తదితరులు పాల్గొన్నారు




