మీకోసం మేమున్నాం.. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి…
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో పదిర గ్రామంలో గ్రామ ప్రజలను ఉద్దేశించి మీకోసం మేమున్నాం అని యువతకు గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని యువత పెడదారిన పడవద్దని తల్లిదండ్రులు వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వారినే సన్మార్గంలో పెట్టాలని సూచించారు చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలని గారాబం చేయవద్దని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనంపై బయటకు వస్తే హెల్మెట్ తప్పనిసరని హెచ్చరించారు. చాలామంది వ్యసనాల బారిన పడి ఓవర్ కాన్ఫిడెన్స్ తో వాహనాలు నడుపుతున్నారని దీంతో ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. లైసెన్సు హెల్మెట్ ధరించడం లేనిచో భారీగా జరిమానాలు విధించడం జరుగుతుందని ఎల్లారెడ్డిపేట పోలీసులు తెలిపారు. కన్నవారికి పుత్రశోకం మిగిల్చవద్దని కోరారు కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట వలయ అధికారి శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ పోలీస్ కానిస్టేబుల్ సతీష్ పోలీసు సిబ్బంది పదిర గ్రామ ప్రజలు మీకోసం అనే శీర్షికన అవగాహన సదస్సులో పాల్గొన్నారు
