కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం, గ్రామంలోని ప్రతిమ ఫౌండేషన్, జి.ఎం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ కేంద్రము ను సంయుక్తంగా నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి కై
ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, మహిళల టైలరింగ్, హోమ్ హెల్త్ ఎయిడ్ స్వల్పకాలిక కోర్సు లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శిక్షణ
పూర్తి చేసుకున్న యువతీ,యువకులకు ధ్రువీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ చెన్నమనేని వికాస్,డా.దీప హాజరై యువతీ, యువకులకు శనివారం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత ఉపాధిలో ఉంటే దేశ అభివృద్ధి జరుగుతుందని దేశ అభివృద్ధికి యువతే మూలమని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధిని కల్పించే ఉద్దేశంతో 2017 సంవత్సరంలో నాగారంలో మా తండ్రి మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తన స్వంత భూమిలో ఈ శిక్షణ కేంద్రాన్ని స్థాపించారని,ఆయన చూపిన దారి లో నడుస్తూ అప్పటి నుండి నా పర్యవేక్షణ లో శిక్షణ కేంద్రం ను కొనసాగిస్తున్నానని అప్పటి నుండి ఇప్పటి వరకు ఉచిత ఉపాధి కోర్సులలో మొత్తం 1,157 మంది యువతీ యువకులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో శిక్షణ అందించగా,1059 మంది యువతీ, యువకులకు పలు రంగాల్లో ఉపాధిని పొందారాని, స్వయం ఉపాధి తో యువత తప్పు దారిన పడకుండా కుటుంబలకు ఆసరాగా నిలుస్తుందని ఇందు లో మా వంతు సహకారం అందిచడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. యువత అవసరాల మేరకు రాబోయే రోజులలో ఇంకా కొత్త కోర్సు లను ఏర్పాటు చేస్తామని ఈ అవకాశలను వేములవాడ చుట్టూ పక్కన మండలాల యువత సద్వినియోగం చేసుకోవాలి అన్నారు
ఈ కార్యక్రమంలో ప్రతీమ ఫౌండేషన్ ప్రతీ నిధులు జీఎంర్ వరలక్ష్మి ఫౌండేషన్ సిబ్బంది యువతి యువకులు పాల్గొన్నారు.
