రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నివాసముంటున్న వికలాంగులకు సుమారు 70 మందికి స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ చేతుల మీదుగా బస్ పాస్ లను అందజేశారు.
వికలాంగులు 50 శాతం డిస్కౌంట్ తో పల్లె వెలుగు,ఎక్స్ ప్రెస్ డీలక్స్ బస్ లలో ప్రయాణించవచ్చని సిరిసిల్ల ఆర్ టి సి డిపో సూపర్ వైజర్ మల్లేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శి దేవరాజు,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, ఎనగందుల బాబు,రేసు గణేష్ బస్ పాస్ లబ్దదారులు పాల్గొన్నారు.