రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మొహమ్మద్ లతీఫ్ ప్రిన్సిపల్ శరత్ కుమార్ లు ఉపాధ్యాయులు అందరిని సన్మానించారు.
అనంతరం కరస్పాండెంట్ మొహమ్మద్ లతీఫ్ మాట్లాడుతూ స్వచ్ఛమైన మనసుతో సానుకూల దృక్పథంతో విద్యతోపాటు విలువలను నేర్పుతూ విద్యార్థి జీవితంలో వెలుగులను నింపుతున్నగురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శరత్ కుమార్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.