Breaking News ప్రకటనలు విద్య

విద్యార్థులకు నైతిక విలువలను నేర్పేది కుటుంబ సభ్యులు

279 Views

విద్యార్థులకు నైతిక విలువలను నేర్పేది కుటుంబ సభ్యులు

శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 బ్రాంచ్ లో కుటుంబ విశిష్టత కార్యక్రమం

విద్యార్థులకు కుటుంబ విలువలను నేర్పేది కుటుంబ సభ్యులు అని శ్రీ చైతన్య ప్రిన్సిపల్ సాయి కృష్ణ అన్నారు. కొంపల్లి-5 బ్రాంచ్ లో శనివారం విద్యార్థులకు విశిష్టతను తెలియజేస్తూ వికాసం అనే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబంలోని పెద్దవారి యొక్క విలువలను గూర్చి విద్యార్థులకు తెలియచెప్పి వారు చెప్పే మాటలు ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తును ఇస్తుందని వారికి ఇది పునాది అని,పెద్దల ఆశీస్సులతో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులను సన్మానించి అనంతరం బహుమతులు అందజేసి వారి ఆశీస్సులు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతయ్యలు అలాగే కొంపల్లి జోన్ ఏజీఎం జీవి రమణారావు, ఆర్ఐ చక్రి, పాఠశాల ప్రిన్సిపల్ సాయి కృష్ణ, హాస్టల్ ప్రిన్సిపల్ చందు, అకడమిక్ జోనల్ కోఆర్డినేటర్ రవి, డీన్ గోవిందు, అసోసియేట్ డీన్ సంపత్,ఐపీఎల్ ఇన్చార్జి,శ్రవణ్ ఐకాన్ ఇంచార్జి శివానంద, సి బ్యాచ్ ఇన్చార్జి రణదీప్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్